మానవ పరిణామ క్రమంలో ఆవలింత ఒక సామూహిక సహజసిద్ధ స్వభావము (herd instinct). ఈ విధంగా మనం కేవలము మనుషుల మధ్యనే కాక, మనిషి మరియు ఇతర జంతువుల మధ్యన కూడా చూడవచ్చు . ఉదాహరణకు మనిషి ఆవలింతని చూసిన కుక్క కూడా, ఆవలించటం మొదలుపెడుతుంది. ఆవలింత వాడిపళ్ళని (canine teeth) చూపించడానికి పనికివచ్చేది. కొంత మంది శాస్త్రఙ్ఞుల ప్రకారం ఆవలింత మెదడుని చల్లబరిచే ప్రక్రియ. మెదడులోని మిర్రర్ న్యూరాన్లు బాహ్య ప్రేరేపకముచే (external stimulus) ప్రేరేపింపబడినచో మెదడు లోని సరిగ్గా అవే ప్రదేశాలను ప్రేరేపించును. మానవునిలోని అనుసరించి నేర్చుకొనుట అను స్వభావమునకు ఈ మిర్రర్ న్యూరాన్లు కారణం. (ఉదాహరణ: భాష నేర్చుకొనుట). కావున అవలింత అన్నది కూడా మిర్రర్ న్యూరాన్ల వలన కావఛ్చునని శాస్త్రఙ్ఞుల అభిప్రాయం.
Tuesday, August 7, 2007
Subscribe to:
Comments (Atom)